US Consul General: విశాఖ అందాలను తిలకించిన అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్
అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ (Laura Williams) విశాఖలోని కైలాసగిరిపై ఇటీవల ఏర్పాటు చేసిన గాజు వంతెన (Glass bridge)ను సందర్శించారు. వీఎంఆర్డీఏ, రెవెన్యూ అధికారులు ఆమెకు వంతెన విశేషాలు వివరించారు. అనంతరం ఆమె జిప్లైనర్, స్కైసైక్లింగ్ వద్ద ఫొటోలు దిగారు. బ్యాటరీ కారులో అద్దాల రైల్లో కొద్దిసేపు విహరించి విశాఖ (Visakha) నగర అందాలను వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సముద్ర తీరాన కొండపై నిర్మించిన ఈ నిర్మాణం ఆకర్షణీయంగా ఉందని, గ్లాస్ బ్రిడ్జి పై నుంచి సముద్రం, విశాఖ నగరం చాలా అందంగా కనిపిస్తున్నాయని తెలిపారు. పర్యాటకులను ఆకర్షించే మంచి ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకువచ్చారని ప్రశంసించారు.






