అప్పటివరకు దేవినేని పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు : సీఐడీ
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియోను మార్ఫింగ్ చేశానని తనపై సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వేసిన క్యాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగంది. సీఐడీ అధికారులు తనను ఇరికిచేందుకే కేసు నమోదు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్లో తరపున వాదనలు విన్న న్యాయస్థానం దర్యాప్తు అధికారిని మార్చాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిబంధన 41 కింద ఆయనకు రక్షణ కల్పించాలని సూచించింది. మే 7వ తేదీ వరకు ఎలాంటి చర్యలు చేపట్టొద్దని కోర్టు సూచించింది. ఈ నెల 29న మంగళగిరి సీఐడీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని దేవినేని ఉమను ధర్మాసనం ఆదేశించింది. అప్పటి వరకు దేవినేని ఉమపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీఐడీ అధికారులకు న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను మే 7వ తేదీకి వాయిదా వేసింది.












