పోలవరంపై కేంద్రం మరో నిబంధన.. తాజాగా మరోసారి
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం మరో మెలిక పెట్టింది. మరోసారి సామాజిక, ఆర్థిక సర్వేను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి షరతు విధించింది. లోక్‌సభలో వైసీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌పై డీపీఆర్ తయారు చేయాల్సిందేనని నిబంధన విధించినట్లు జల్‌శక్తి శాఖ పేర్కొంది. పోలవరం నిర్మాణంలో ప్రస్తుతానికి రూ.15,668 కోట్ల వరకే తమ బాధ్యత అని కేంద్రం మరోసారి తేల్చి చెప్పింది. ఫిబ్రవరి 22 వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.14,336 కోట్లు మాత్రమే అని, దీనిలో రూ.12,311 కోట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తిరిగి చెల్లించిందని వెల్లడిరచింది. రూ.437 కోట్లకు పోలవరం అథారిటీ బిల్లులు పంపిందని కేంద్ర జల్‌శక్తి శాఖ పేర్కొంది. పోలవరం ప్రాజెక్టును ఎప్పుడు పూర్తిచేస్తారో గడువు చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలతో పోలవరం నిర్మాణం మరింత ఆలస్యమయ్యే అవకాశముంది.













