Minister Pemmasani : ప్రధాని మోదీని కలిసిన కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్(Pemmasani Chandrasekhar) తన కుటుంబ సభ్యుల(Family members) తో వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi ) ని కలిశారు. ఈ అమూల్యమైన క్షణాలు మరువలేనివని పెమ్మసాని పేర్కొన్నారు. ప్రధాని (Prime Minister) తన విలువైన సమయాన్ని కేటాయించినందుకు మా కుటుంబం తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మోదీ దూరదృష్టి గల నాయకత్వం, అంకితభావం వినయ శీలతతో కూడిన వ్యక్తిత్వం మమ్మల్ని ఎంతో ప్రభావితం చేసింది. ఈ క్షణాలు మాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి అని పెమ్మసాని పేర్కొన్నారు.