దేశాభివృద్ధిలో ఏపీ పాత్ర కీలకం : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
దేశాభివృద్ధిలో ఏపీ పాత్ర కీలకమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. విజయవాడ బెంజిసర్కిల్ రెండో ఫ్లైఓవర్‌తో పాటు నిర్మాణం పూర్తయిన పలు జాతీయ రహదారులను సీఎం జగన్, గడ్కరీ ప్రారంభించారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇవాళ మరిచిపోలేని రోజు అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమన్నారు. పారిశ్రామిక రంగాలు ఎంతో కీలకమైనవి. వ్యవసాయ రంగంలో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో పోర్టులది కీలక పాత్ర అన్నారు. దేశాభివృద్ధికి గ్రామాల అనుసంధానం ఎంతో కీలకం అని వాజ్‌పేయి భావించారు. అభివృద్ధి విషయంలో కేంద్రం ఎవరిపైనా వివక్ష చూపించదన్నారు. కేంద్రం అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఏపీలో రోడ్ల అభివృద్ధికి రూ.3 లక్షల కోట్లను కేటాయిస్తాం. రాష్ట్రంలో 3 గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలు నిర్మిస్తున్నాం.
2024లో రాయ్‌పూర్-విశాఖ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. నాగ్‌పూర్` విజయవాడ, బెంగళూరు-చెన్నై మధ్య గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలు నిర్మిస్తాం. రూ.5 వేల కోట్లతో చిత్తూరు-తంజావూర్ ఎక్స్‌ప్రెస్ హైవేని పూర్తి చేస్తామన్నారు. కాలుష్యం తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పెట్రోల్, డీజిల్‌కు బదులుగా వాహనాల్లో సీఎన్జీ, ఎల్ఎన్జీ వాడాలని సూచించారు. భవిష్యత్‌లో గ్రీన్ హైడ్రోజన్ వినియోగాన్ని ప్రోత్సహిస్తామన్నారు. ఈ దేశంలో రైతులు కేవలం అన్నదాతలే కాదని, విద్యుత్ ఉత్పతిదారులుగా మారతారని పేర్నొన్నారు. లాజిస్టిక్ పార్కుల కోసం రాష్ట్ర భూమి కేటాయించాలని సీఎం జగన్ కోరారు. ఏపీ 20 ఆర్వోబీలు అడిగితే కేంద్రం 30 ఆరోవోబీలు మంజూరు చేసిందని వెల్లడించారు.













