కలిసి పనిచేద్దాం… అభివృద్ధికి పాటుపడదాం
అందరం కలిసి పనిచేద్దాం – రాష్ట్రాభివృద్ధికి పాటుపడదాం అని కేంద్ర పౌర విమానయాన శాఖామాత్యులు అశోక్ గజపతిరాజు పిలుపునిచ్చారు. ఢిల్లీలోని ఏపీ భవనలో జరిగిన నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు పాల్గొని అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లేందుకు అనుభవం ఉన్న నాయకత్వం మనకుందని వెల్లడించారు. విభజన వలన జరిగిన నష్టాన్ని మనం ఎవ్వరం వెనుకకు తీసుకురాలేమని, కానీ రాష్ట్రాన్ని అభివృద్ధిపథం వైపు నడిపించేందుకు అందరూ రావాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా అమరావతి నిర్మాణానికి స్వచ్ఛందంగా రైతులు ముందుకు వచ్చి 33 వేల ఎకరాల భూమిని ఇచ్చారని, వారి త్యాగం ఏవ్వరూ మరచిపోరని గుర్తు చేశారు.













