ఏపీ అప్పుపై కేంద్రం వెల్లడించిన విషయం ఇదే…. 2019తో పోలిస్తే
పార్లమెంటు సాక్షీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పుల చిట్టాను కేంద్ర ఆర్థిక శాఖ మరోసారి బయటపెట్టింది. 2019తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ అప్పులు దాదాపు రెండింతలు పెరిగాయని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2019లో రాష్ట్ర అప్పులు రూ.2,64,451 కోట్లు ఉండగా, 2020లో రూ.3,07,671 కోట్లు, 2021లో రూ.3,53,021 కోట్లు. 2022 సవరించిన అంచనాల తర్వాత రూ.3,93,718 కోట్లు, 2023 బడ్జెట్ అంచనాల ప్రకారం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.4,42,442 కోట్లుగా ఉంది. ఏటా సుమారు రూ.45 వేల కోట్లు అప్పులు చేస్తోంది అని పంకజ్ చౌదరి వెల్లడిరచారు.













