చివరి బడ్జెట్ లో కూడా బిజెపి ఏపికి ద్రోహమే చేసింది : సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ మాటే ఈ బడ్జెట్ లో ప్రస్తావన లేదు. రోజుకు రూ.16 ఇస్తే రైతులకు ఒరిగేదేమీ లేదు. 5ఎకరాల భూమి ఉంటే రూ.500 భిక్ష వేస్తారా..? కేంద్రబడ్జెట్ పేదలపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. సామాన్యులకు ఒరిగిందేమీ లేదు. ఈబిసీ రిజర్వేషన్ల ఆదాయ పరిమితి రూ.8లక్షలు. ఆదాయపన్నుకు మాత్రం రూ.5లక్షలు పెట్టారు. ఇటువంటి విరుద్దతలు అనేకం ఉన్నాయి. నరేగాలో రాష్ట్రాన్నే అప్పు తెచ్చుకోమన్నారు. కేంద్రం ఇప్పటికే నరేగా బకాయిలు భారీగా చెల్లించాలి. బడ్జెట్ లో నిరుద్యోగ సమస్యను అడ్రస్ చేయలేదు. దేశంలో నిరుద్యోగంపై చైనా కూడా హెచ్చరించింది. మన రాష్ట్రంలోనే 14లక్షల మందికి ఉపాధి కల్పించాం. ఒక్క ‘కియా’ లోనే వేలాదిమందికి ఉద్యోగాలు. ఆటోమొబైల్, ఐటి,ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తెచ్చాం. ఎంఎస్ ఎంఈ పార్కులలో పెద్దఎత్తున ఉపాధి. బిజెపి వైఫల్యం వల్లే దేశంలో నిరుద్యోగం. ఆఖరి బడ్జెట్ లో కూడా నిరాశ పరిచారు. ఈ 5ఏళ్ల మోది పాలన ఘోర వైఫల్యం. దేశాన్ని పెద్ద సంక్షోభంలోకి బిజెపి నెట్టింది.













