బాబుపై ఉండవల్లి శ్రీ దేవి వైరల్ ట్వీట్.. ఆ కత్తి గుర్తు ఎవరికోసమో?
ఈరోజు టీడీపీ అభ్యర్థుల మూడో జాబితాని విడుదల చేసింది. ఈ లిస్టు విడుదలయ్యాక చాలామంది నేతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి టీడీపీ గూటికి చేరిన ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి నెల్లూరు రూరల్.. ఆనం రామనారాయణ రెడ్డి కి ఆత్మకూరు టికెట్లను టీడీపీ అధిష్టానం కట్టబెట్టింది. ఈ జాబితాలో అయినా తాము ఆశించిన టికెట్లు వస్తాయి అని ఎదురుచూసిన ఉండవల్లి లిస్ట్ చూసి ఉలిక్కిపడింది. టికెట్టు దక్కలేదన్న కోపమో.. లేక మరేదైనా బలమైన కారణము తెలియదు కానీ మొత్తానికి జాబితా విడుదలయ్యాక ఆమె పెట్టిన ట్వీట్ మాత్రం సంచలనంగా మారింది. రాజకీయాలు కొత్త కథ అలాగే ఉంటాయి అని కొందరు ఈ ట్వీట్ పై వ్యాఖ్యానిస్తున్నారు. ఆమె చేసిన ట్వీట్ లో రాజకీయాలు ఎలా ఉంటాయో.. ఎవరు ఎలాంటివారో ఈరోజు అర్ధమయ్యింది అని రాస్తూ హాష్ ట్యాగ్ బాపట్ల అని పెట్టి ఓ కత్తి సింబల్ ని పెట్టారు. ఆ కత్తిపోటు బాబు పొడిచిన వెన్నుపోటుకి గుర్తు అంటున్నారు వైసీపీ నేతలు.













