2019లో పోటీ చేయను
తాను ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేనని, 2019 ఎన్నికల్లో పోటీచేయనని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సృష్టం చేశారు. ఉండవల్లి సోమవారం ఏపీ నూతన సచివాలయానికి విచ్చేశారు. కాంగ్రేస్ నేత మల్లాది విష్ణుతో కలిసి కొత్త అసెంబ్లీ చూడడానికి వచ్చిన ఉండవల్లి మీడియాతో మాట్లాడారు. తనకు టీడీపీలోనూ, వైసీపీలోనూ తెలిసినవాళ్లు ఎవరు లేరని అందుకే మల్లాది విష్ణుతో కలిసి వచ్చానని పేర్కొన్నారు. అసెంబ్లీ బాగుందంటే టీడీపీలోకి వెళ్తున్నాననంటారు అంసెబ్లీ బాగలేదంటే వైసీపీలో చేరుతున్నానంటారు అని అసెంబ్లీ ఎలా ఉందని ప్రశ్నిశించిన విలేకరికి సమాధానమిచ్చారు. కొత్త అసెంబ్లీని చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని, ఈ విషయాన్ని మల్లాది విష్ణుకు చెబితే ఆయన ఈ రోజు బాగుందని చెప్పి వెళ్దామంటే వచ్చానని ఉండవల్లి చెప్పారు. అసెంబ్లీ నిర్మాణం బాగుందని, వర్సపు నీరు వచ్చినంత మాత్రాన వివాదం చేయ్యాల్సిన అవసరం లేదని అరుణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు.













