వాణికి ట్విస్ట్ ఇచ్చిన దువ్వాడ..! మాధురి స్కెచ్ అదిరిందా..!?
ఆంధ్రప్రదేశ్ లో కొంతకాలంగా దువ్వాడ శీను వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. భార్య దువ్వాడ వాణితో పాటు కుమార్తెలతో ఆయనకు విభేదాలున్నాయి. దీంతో ఆయన విడిగా ఉంటున్నారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ కు దివ్వెల మాధురి అనే ఆవిడతో సన్నిహిత సంబంధాలున్నాయి. మాధురి వల్లే తమ కుటుంబం నాశనం అయిందని దువ్వాడ వాణి, ఆమె పిల్లలు ఆరోపిస్తున్నారు. అయితే వాళ్ల ఆరోపణలను దువ్వాడ శీనుతో పాటు దివ్వెల వాణి కొట్టిపారేస్తున్నారు. తమ మధ్య సన్నిహిత సంబంధాలున్న మాట వాస్తవమేనని ఇరువురూ ఆంగీకరిస్తున్నారు.
దువ్వాడ శ్రీనివాస్ అక్కవరంలో కొత్త ఇంటిని నిర్మిస్తున్నారు. ఆ ఇల్లు తమదేనని దువ్వాడ వాణి చెప్తున్నారు. అయితే తమను ఇంట్లోకి రానివ్వట్లేదని వాణితో పాటు పిల్లలు ఆరోపిస్తున్నారు. గతంలో చాలా సందర్భాల్లో ఆ ఇంట్లోకి వెళ్లేందుకు దువ్వాడ వాణి, పిల్లలు ప్రయత్నించారు. అయితే శ్రీనివాస్ లోపలికి రానివ్వలేదు. దీంతో దువ్వాడ వాణి కోర్టును ఆశ్రయించారు. తన భర్త ఇంట్లోకి తమను వెళ్లనిచ్చేలా ఆదేశాలివ్వాలని ఆమె కోర్టును అభ్యర్థించారు. వాణికి అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఆమె ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.
అయితే ఇక్కడే ట్విస్ట్ జరిగింది. దువ్వాడ శ్రీనివాస్ కొత్త ఇంట్లో దివ్వెల మాధురి ప్రత్యక్షమయ్యారు. ఇది తన ఇల్లు అని.. దీనిపై ఎవరికీ ఆర్హత లేదని ఆమె స్పష్టం చేశారు. కోర్టు తీర్పు నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ ఆ ఇంటిని దివ్వెల మాధురి పేరుట రిజిస్టర్ చేశారు. దివ్వెల మాధురి గతంలో తనకు 2 కోట్లు ఇచ్చారని.. ఇప్పుడు చెల్లించే పరిస్థితిలో లేనందున ఇంటిని రాసిచ్చినట్లు శ్రీను చెప్తున్నారు. ఇదే విషయాన్ని దివ్వెల మాధురి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో తనను అడ్డుకునేందుకు ఇంటిని మాధురికి రాసిచ్చినట్లు దువ్వాడ వాణి ఆరోపించారు.
అయితే గతంలో దివ్వెల మాధురి.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను గారు అని సంబోధించేది. అయితే తాజా ప్రెస్ మీట్ లో దువ్వాడ శీను అని ఏకవచనంతో సంబోంధించింది. దీనిపై సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. ఆస్తికోసం దువ్వాడ శీను మెడలు వచ్చి రాబట్టుకున్నావంటూ మాధురిని మెచ్చుకుంటున్నారు. మాధురీ.. మీ స్కెచ్ అదిరిందంటూ సెటైర్లు వేస్తున్నరు. మొత్తానికి దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురు, దువ్వాడ వాణి ఎపిసోడ్ రోజురోజుకూ మరింత ఆసక్తి కలిగిస్తోంది. మున్ముందు ఎలాంటి ములుపులు తీసుకుంటాయోననే ఉత్కంఠ రేపుతోంది.













