ఇంజినీరింగ్ చరిత్రలోనే అత్భుతం .. స్టాప్‌లాగ్ పై
తుంగభద్ర జలాశయంలో స్టాప్‌లాగ్‌ను ఏర్పాటు చేసి ఇంజినీరింగ్ చరిత్రలోనే అద్భుతం సృష్టించబోతున్నామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. వేగంగా, ఉధృతంగా ప్రవహిస్తున్న నీటికి అడ్డుకట్ట వేయడానికి చేస్తున్న ప్రయత్నమని, ఈ ప్రక్రియలో సాంకేతికంగా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. తుంగభద్ర డ్యాంను మంత్రి సందర్శించారు. క్రస్ట్‌గేట్ నిపుణుడు కన్నయ్యనాయుడు, ఇంజనీర్లతో మాట్లాడారు. అనంతరం కేశవ్ మీడియాతో మాట్లాడారు. ఒకవైపు చైన్‌లాక్ తెగిపోయింది. మరోవైపు కౌంటర్ వెయిట్ 30 టన్నుల బరువు గల లాక్పైన నిలబడి పోయింది. తొలి సవాల్‌గా పైనున్న బరువును నిదానంగా కిందకు దించుకోవలసి ఉంటుంది. జేఎస్‌డబ్ల్యూ రెండు భారీ క్రేన్లను తీసుకొచ్చి బోర్డు ఆధ్వర్యంలో పని చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం. చంద్రబాబు, సిద్ధరామయ్య సమన్వయంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. గేటు తయారీ బాధ్యతలను నైపుణ్యం గల కంపెనీలకు అప్పగించాం అని తెలిపారు.













