ఆక్సిజన్ అందించలేని ప్రభుత్వం… మూడు రాజధానులు

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ఆక్సిజన్ అందించలేని ప్రభుత్వం మూడు రాజధానులు నిర్మిస్తుందా? అని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆక్సిజన్ అందక కరోనా రోగులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ఇలాంటి ఘటనలు వైసీపీ ప్రభుత్వ అసమర్థతకు పరాకాష్ట అని చెప్పారు. ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్, మందులు కొరత లేకుండా ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బతుకు భరోసా లేని కారణంగా కరోనా బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. వ్యాక్సిన్ కార్యక్రమం కూడా నత్తనడకన సాగుతుందన్నారు. ప్రభుత్వం టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కోరారు.