శ్రీలంక కంటే.. ఆంధ్రప్రదేశ్ లోనే
శ్రీలంక ఆర్థిక పరిస్థితి కంటే, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ మూడేళ్ల పాలనలో అప్పులు పుల్, అభివృద్ధి నిల్, సంక్షోభంలో సంక్షేమం నిలిచిందని విమర్శించారు. ప్రస్తుత రాష్ట్ర అప్పు రూ.8 లక్షల కోట్లు అని, ఇందులో జగన్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.5 లక్షల కోట్లు అని తెలిపారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిరదని వ్యాఖ్యానించారు. అమ్మ ఒడి నాన్న బుడ్డికి చాలడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.













