మధ్యపాన నిషేధానికి బదులుగా.. నిషా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యపాన నిషేధానికి బదులుగా నిషా పథకానికి తెరలేపారని పీసీసీ కార్వనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి ధజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుత సీఎం జగన్ మద్యం ఆదాయం తాకట్టు పెట్టి మరీ అప్పులు తేవడం దారుణమన్నారు. ఆడిన మాట తప్పడంలో జగన్ ఎప్పుడూ ముందుంటున్నారని విమర్శించారు. మద్యపాన నిషేధంపై ప్రభుత్వం చేతులెత్తేసిందని అన్నారు. రాష్ట్రంలో మద్యపాన నిషేదానికి బదులుగా నిషా ఎక్కిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. జగన్ పాలనలో రాష్ట్రం మద్యాంధ్రప్రదేశ్‌గా, తాగుబోతు ఏపీగా, సారా ఆంధ్రప్రదేశ్‌గా మారిపోయింది.
అధికారంలోకి రాకముందు చెప్పింది ఒకటి, అధికారంలోకి వచ్చాక చేస్తున్నది మరొకటి అని అన్నారు. ఏరు దాటేంతవరకు ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అనే నైజం కనబడుతోంది. మేనిఫెస్టో తమకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని జగన్ అన్నారు. మరి మద్యం విధానం ఏమైంది? అధికారంలోకి వచ్చాక దశల వారీ మద్య నిషేదం పోయి, దశలవారీ మద్య నిషా పథకంలా మారిందన్నారు.













