మొన్న కర్ణాటకలో, నిన్న తెలంగాణలో…రేపు ఆంధ్రప్రదేశ్ లోనూ
మొన్న కర్ణాటకలో, నిన్న తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, రేపు ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధిస్తుందని ఏపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ ఎన్. తులసిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వై నాట్ ఏపీ కాంగ్రెస్ నినాదమని తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పొత్తుల కోసం తన కుటుంబాన్ని చీలుస్తున్నారంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదు. షర్మిలకు ఆస్తి, పదవి ఇవ్వద్దని చంద్రబాబు, పవన్ కల్యాణ్, కాంగ్రెస్ నాయులు ఎప్పుడైనా చెప్పారా? అని ప్రశ్నించారు. వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీతపై కేసు నమోదు చేయాలని ఎవరు చెప్పారు? పరిమళ్ నత్వానికి రాజ్యసభ పదవి ఎందుకోసం ఇచ్చారు అని నిలదీశారు. పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.













