టీటీడీ కీలక నిర్ణయం.. సంప్రదాయ భోజనానికి
కాస్టు టూ కాస్ట్ పద్ధతిని శ్రీవారి భక్తులకు సంప్రదాయ భోజనం పెట్టాలంటూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీసుకున్న నిర్ణయం వెనక్కు తీసుకుంటున్నట్టు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. డబ్బులు తీసుకుని భోజనం పెట్టాలంటూ టీటీడీ తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఈ పథకాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 26వ తేదీ నుంచి టీటీడీ ప్రయోగాత్మకంగా భక్తులకు సంప్రదాయ భోజనాన్ని ప్రారంభించిన విషయం విదితమే. పాలకమండలి లేని సమయంలో టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకున్నారని, తిరుమలలో ఏ కార్యక్రమం నిర్వహించినా స్వామివారి ప్రసాదంగానే పెట్టాలి కాని డబ్బులు వసూలు చేయకూడదన్న ఆలోచనతో సంప్రదాయాన్ని భోజనాన్ని నిలిపి వేస్తున్నామని తెలిపారు.













