శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఏప్రిల్ 1 నుంచి
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు శుభవార్త. కరోనా కారణంగా నిలిచి పోయిన ఆర్జిత సేవలను టీటీడీ తిరిగి ప్రారంభించనుంది. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 1 నుంచి తిరుమలలో ఆర్జిత సేవలను పున ప్రారంభించనున్నట్లుగా తెలిపింది. సుప్రభాతం, తోమాల, అర్చన అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, మేల్చాట్ వస్త్రం, అభిషేకం, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకారణ సేవలను పున ప్రారంభించనున్నట్లుగా టీటీడీ వెల్లడించింది. గతంలో ఉన్న విధానంలోనే ఆర్జిత సేవ టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ తెలిపింది.













