శ్రీవారి భక్తులకు శుభవార్త..
శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1 నుంచి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయించింది. కొవిడ్ నేపథ్యంలో 2020 మార్చి నుంచి భక్తులను అనుమతించకుండా ఏకాంతంగా ఆర్జిత సేవలు నిర్వహిస్తున్నారు. కొవిడ్ ఉధృతి తగ్గిన నేపథ్యంలో రెండేళ్ల తర్వాత తిరిగి భక్తులకు అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. కొవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ ఆయా సేవలకు భక్తులను అనుమతిస్తారు.













