3 నుంచి తిరుమలలో పవిత్రోత్సవాలు
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 3 నుంచి పవిత్రోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం వైభవంగా నిర్వహించనుంది. అంకురార్పణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో భక్తుల వల్లగానీ, సిబ్బంది వల్లగాని తెలిసి, తెలియక జరిగే దోషాలవల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం కానీయకుంఆ ఆగమశాస్త్రం ప్రకారం ఈ పవితోత్రవాలను నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా మూడు రోజులపాటు ఉదయం 9 గంటలకు స్నపన తిరుమంజనం, సాయంత్రం భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారు ఆలయ నాలుగు మాడవీధుల్లో వివారించి భక్తులకు దర్శనమిస్తారు.













