అయోధ్యకు తిరుమల శ్రీవారి ప్రసాదంగా లక్ష లడ్డూలు
అయోధ్యలో ఈ నెల 22న ప్రాణ ప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి ప్రసాదంగా లక్ష లడ్డూలను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చే భక్తుల కోసం లక్ష లడ్డూలను పంపించనుంది. ఇందుకోసం తిరుమలలోని శ్రీవారి సేవాసదన్ 1 లో శ్రీవారి సేవకులు ఒక్కో కవర్లో రెండు లడ్డూలు చొప్పున ప్యాకింగ్ చేశారు. ఇలా మొత్తంగా 350 మంది శ్రీవారి సేవకులు, టీటీడీ డిప్యూటీ ఈవో శివప్రసాద్, పోటు ఏఈవో శ్రీనివాసులు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.













