శ్రీవాణి ట్రస్టు ఆన్లైన్ సేవలు ప్రారంభం
శ్రీవాణి ట్రస్టుకు దాతలు ఆన్లైన్లో విరాళం అందించి బ్రేక్ టికెట్ పొందే సౌకర్యం ప్రారంభించామని తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సోమవారం ఈ సౌకర్యాన్ని ప్రారంభించి డిసెంబర్ 31 వరకు ఆన్లైన్ కోటాను విడుదల చేసినట్టు తెలిపారు. ఈ దాతలకు శుక్రవారాల్లో 200 బ్రేక్ టికెట్లు, మిగిలిన రోజుల్లో 500 బ్రేక్ టికెట్ల చొప్పున ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. టీటీడీసేవాఆన్లైన్.కామ్ వెబ్సైట్ ద్వారా విరాళం అందించి టికెట్లు పొందిన భక్తులు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కు చేరుకుని దర్శనానికి వెళ్లవచ్చని తెలిపారు.













