సీఎం వైఎస్ జగన్ కు టీటీడీ ఆహ్వానం
జమ్మూలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతనంగా నిర్మించిన శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణకు హాజరుకావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టీటీడీ ఆహ్వానించింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎస్వీ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్, న్యూఢిల్లీ ప్రెసిడెంట్ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కలిశారు. జూన్ 3-8 వరకు జమ్మూలోని శ్రీవారి ఆలయంలో మహా సంప్రోక్షణ, 8న మిధున లగ్నంలో కళావాహన, ఆరాధన అనంతరం ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమాలకు హాజరుకావాలని వారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఆహ్వాన పత్రిక అందించారు.













