టీటీడీ పాలకమండలి సమావేశం… కీలక నిర్ణయాలు ఇవే
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సమావేశం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ క్రమంలో టీటీడీ పాకలమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుపతిలో శ్రీనివాస సేతు త్వరగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది. అలాగే, ప్రకృతి వ్యవవసాయం ద్వారా పండిరచిన పంటలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఢిల్లీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుమల తరహా బ్రహోత్సవాలు జరపాలని నిర్ణయం తీసుకుంది. లడ్డూ ప్రసాదం కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారా చేయాలని నిర్ణయం తీసుకుంది. టీటీడీఈ గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్ ఆధునీకరణకు రూ.14 కోట్లు, తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి రూ.12 కోట్లు, తిరుపతి విద్యా సంస్థల్లో కాంట్రాక్ట్ సిబ్బందిని కొనసాగిస్తూ అవసరమైన శాశ్వత ఉద్యోగులను నియమించాలని నిర్ణయించింది. ఢల్లీి ఎస్వీ కాలేజీలో ఆడిటోరియం అభివృద్ధికి రూ.4.13 కోట్లు కేటాయించారు. ఢిల్లీ ఆలయంలో మే 3 నుంచి 16వ తేదీ వరకు శ్రీవారి బ్రహోత్సవాలు జరిపించుకున్నారు. తిరుపతిలో శ్రీనివాస సేతు త్వరగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో ఒంటిమిట్ట కోదండ రామాలయంలో బ్రహ్మోత్సవాలు, కల్యాణం విజయవంతంగా జరిగాయి. విజయవంతం చేసిన అందరికీ అభినందనలు తెలిపారు.













