టీటీడీ శుభవార్త.. నూతన వధూవరులకు
నూతన వధువరులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్తను అందజేసింది. కొత్త జంటలకు తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందే అవకాశాన్ని కల్పించింది. పూర్తి చిరునామాతో సహా శుభ లేఖ పంపితే శ్రీవారి కల్యాణ తలంబ్రాలు, పసుపు, కుంకుమ, కంకణాలు, కల్యాణ సంస్కృతి పుస్తకం, ప్రసాదాన్ని పోస్టులో పంపుతారు. గతంలోనే ఈ విధానం అమల్లో ఉండగా కరోనా కరణాంగా టీటీడీ నిలిపివేసింది. ఇప్పుడు ఈ విధానాన్ని పున ప్రారంభించారు. శ్రీ వేంకటేశ్వరస్వామి, ఈవో ఆఫీస్, టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, కేటీరోడ్, తిరుపతి-517501 అనే చిరునామాకు నూతన వధూవరుల వివరాలను పంపాలి. వివాహ ముహూర్తానికి నెలరోజుల ముందుగా వాటిని పంపాల్సి ఉంటుందని టీటీడీ పేర్కొన్నది.













