టిటిడి మాజీ ఇఓ పీవీఆర్కె ప్రసాద్ మృతి
తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఇవో పివిఆర్‌కె ప్రసాద్ (77) సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. శనివారం అర్థరాత్రి అస్వస్థతకు గురైన పీవీఆర్కె ప్రసాద్‌ను బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చేర్చారు. సోమవారం తెల్లవారుజామున రెండు గంటలకు తుదిశ్వాస విడిచారు. సోమవారంనాడే ఆయన పార్థివ దేహానికి పంజాగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. పివీఆర్కె ప్రసాద్ మృతికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన తిరుమలపై ఆయన రాసిన ఎన్నో పుస్తకాలు బహుళ ప్రాచుర్యాన్ని పొందాయి. ఆయన రాసిన పుస్తకాల్లో ఒకటైన నాహం కర్తా హరి కర్తా రచనను ‘తెలుగు టైమ్స్’ సీరియల్‌గా ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ పుస్తకం ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. ఆయన మృతి పట్ల తెలుగు టైమ్స్ చైర్మన్ జయరామ్ కోమటి, ఎడిటర్ అండ్ మేనెజింగ్ డైరెక్టర్ చెన్నూరి సుబ్బారావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.













