తమ కంటే బలమైన ఆధారాలు వస్తే.. అంజనాద్రిపై పునరాలోచన : టీటీడీ ఈవో

అంనాద్రే హనుమంతుడి జన్మస్థలమని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహక అధికారి జవహర్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ విషయంపై ఏర్పడ్డ వివాదాలన్నీ త్వరలోనే సమసిపోతాయని తెలిపారు. అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలమని, దీనికి సంబంధించిన అన్ని ఆధారాలూ తమ వద్ద ఉన్నాయని, వాటిని బహిర్గతం చేశామని పేర్కొన్నారు. అయితే తమ కంటే బలమైన ఆధారాలు ఎవరైనా చూపిస్తే అప్పుడు ఈ విషయంపై పునరాలోచిస్తామని స్పష్టం చేశారు. అప్పటి వరకూ మాత్రం అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలమని స్పష్టం చేశారు. ఆంజనేయుడి జన్మస్థలంపై కిష్కింధ ట్రస్ట్ గోవిందానంద సరస్వతీ స్వామీజీ చూపిన ఆధారాలు సరిగా లేవని అన్నారు. తమపై విమర్శలు చేయడానికే గోవిందానంద పరిమితం అవుతున్నారని ఈవో అసంతృప్తి వ్యక్తం చేశారు.