తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ క్లారిటీ
శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) క్లారిటీ ఇచ్చింది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఏకాంతంగానే స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. కేంద్రం మరోసారి కరోనా హెచ్చరికలు జారీచేసిన క్రమంలో రాష్ట్రం ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని తెలిపారు. వచ్చే నెల 7 నుంచి 15 వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాలను ఆలయానికే పరిమితం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ఆన్లైన్ సర్వదర్శనం టోకెన్ల జారీ ఆలస్యమైందని అన్నారు. వారంలోగా సమస్యను పరిష్కరించి భక్తులకు స్వామివారి దర్శనం అయ్యేలా చర్యలు చేపడతామని తెలిపారు.













