కేంద్ర ఆర్థికశాఖ మంత్రిని కలిసిన టీటీడీ చైర్మన్
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వద్ద ఉన్న రద్దయిన నోట్లను మార్పిడి చేయాలని కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోరారు. నిర్మలా సీతారామన్‌ను వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీలో కలిశారు. నోట్ల రద్దుతో సుమారు రూ.50 కోట్ల పాత నోట్లు టీటీడీలో ఉండిపోయాయని సుబ్బారెడ్డి ఆర్థికమంత్రికి తెలిపారు. నోట్ల రద్దు సమయంలో భక్తులు కానుకలుగా ఇచ్చిన ఆ డబ్బును మార్చాలని వైవీ సుబ్బారెడ్డి కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకు, వెనుకబడిన జిల్లాలకు నిధులు తక్షణమే మంజూరు చేయాలని ఆర్థికమంత్రిని కోరినట్లు సుబ్బారెడ్డి వెల్లడించారు.













