చందనోత్సవం సందర్భంగా సింహాద్రి అప్పన్నకి పట్టువస్త్రాలు
తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున చైర్మన్ వై వి సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలత, టీటీడీ జేఈఓ ధర్మారెడ్డి గారు అర్చక పరివారం సింహాద్రి నాథుడు చందనోత్సవం సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించారు.
రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణగారు పట్టు వస్త్రాలు సమర్పించారు. విశాఖ శారదా పీఠాధిపతి లతోపాటు పలువురు మంత్రులు, ఇతర ప్రముఖులు స్వామిని దర్శించుకున్నారు. జిల్లా కలెక్టర్ మల్లికార్జున, ఆలయ ఈవో ఎంవీ సూర్య కళ, పోలీస్ అధికారులు, ట్రస్ట్ సభ్యులు.. దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు ఆలయ అధికారులు విశేషంగా సేవలందించారు.













