“శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రండి” – సిఎం కు టీటీడీ చైర్మన్, ఈవో ఆహ్వానం
సెప్టెంబరు 18వ తేదీ నుండి 26 వతేదీ వరకు జరిగే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి గారు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ కొట్టు సత్యనారాయణ గారు, టీటీడీ ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి గారు ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించారు.
తాడేపల్లి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం వారు ముఖ్యమంత్రిని కలసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి గారిని చైర్మన్ శ్రీ కరుణాకరరెడ్డి గారు శాలువతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.













