తిరుమలలో ఘనంగా.. హనుమజ్జయంతి వేడుకలు

తిరుమల క్షేత్రంలోని అంజనాద్రి కొండపై ఆంజనేయస్వామి జన్మస్థలిగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)చెబుతున్న ఆకాశగంగ తీర్థం వద్ద హనుమజ్జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆకాశగంగ తీర్థంలో వెలిసిన అంజనాదేవి, బాలా ఆంజనేయస్వామి ఆలయంలో ఉదయం అభిషేకం, అర్చన నిర్వహించారు. జపాలి తీర్థంలోని శ్రీ ఆంజనేయస్వామికి టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి దంపతులు పట్టువస్త్రాలను సమర్పించారు. టీటీడీ ఈవో కేఎస్ జవహర్‍రెడ్డి మాట్లాడుతూ తొలిసారిగా ఆకాశగంగ, జపాలి వద్ద 5 రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.