టీటీడీ కీలక నిర్ణయాలు ఇవే….
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి సమావేశం ముగిసింది. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ధర్మకర్తల మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గొల్లమండపం మార్చేది లేదని సృష్టం చేసింది.
ధర్మకర్తల మండలి నిర్ణయాలివే…
టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితుల నియామకం.
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో మాత్రమే వైకుంఠ దర్శనం.
జమ్ము కశ్మీర్, వారణాసిలో వేంకటేశ్వరస్వామి గుడి నిర్మించే యోచన.
ముంబయిలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం రూ.30 కోట్లు మంజూరు.
బర్డ్ ఆసుపత్రి డైరెక్టర్‌గా మదన్ మోహన్‌రెడ్డి నియామకం.
సంక్రాంతిలోపు తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం దిశగా కార్యాచరణ.













