కోవిడ్ రోగులకు ‘జర్మన్ షెడ్లు’ : టీటీడీ ప్రకటన

కరోనా విలయ తాండవాన్ని చూసి శ్రీవారి మనసు కూడా కరిగిపోయింది. కరోనా బాధితులకు సహాయం చేయడానికి శ్రీవారు ముందుకు వచ్చారు. కరోనా బాధితుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. రోగుల కోసం జర్మన్ షెడ్ల నిర్మణం చేపడతామని ప్రకటించింది. ఏపీలో మొత్తం 22 జర్మన్ షెడ్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. వీటి నిర్మాణానికి 3.52 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖలో 4, కర్నూలులో 2, ప్రకాశంలో 2, అనంతపురంలో 3, కృష్ణాలో 3, గుంటూరులో 3, కాకినాడలో 3 షెడ్లను నిర్మించాలని టీటీడీ నిర్ణయించుకుంది. ఈ విషయంలో అవసరమైన ఖర్చును ఆయా జిల్లాల కలెక్టర్లకు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించుకుంది.