చరిత్ర సృష్టించిన టీటీడీ
ఉదయం నుంచి రాత్రి వరకు, కేవలం రెండు గంటల విరామంతో సంఖ్యతో నిమిత్తం లేకుండా వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాదం అందించగలమా? తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అధికారులకు మొదటగా వచ్చిన సందేహమిది. ముందు మొదలుపెడదాం. ఆ తర్వాత అన్నీ స్వామి చూసుకుంటారు అని అనుకున్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం ప్రారంభించారు. వారు అనుకున్నట్లే జరిగింది. స్వామి కరుణ కురిసింది. విరాళాల వరద ప్రవహించింది. ఒకటీ రెండు కాదు, అన్నప్రసాద టస్టు విరాళాల మొత్తం రూ.వెయ్యి కోట్లకు చేరింది. ఒక ప్రత్యేకమైన కారణంతో నడిచే ట్రస్టుకు ఈ స్థాయిలో నిధులు రావడం ఒక చరిత్ర.













