YS Bharathi: వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు … చేబ్రోలు కిరణ్ అరెస్ట్
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy) సతీమణి వైఎస్ భారతి (YS Bharathi) పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ (Chebrolu Kiran) పై టీడీపీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది. పార్టీ నుంచి కిరణ్‌ను సస్పెండ్ చేసింది. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నేతలను టీడీపీ అధిష్ఠానం ఆదేశించింది. దీంతో పార్టీ నేతలు ఫిర్యాదు చేయడంతో గుంటూరు పోలీసులు (Guntur Police) చేబ్రోలు కిరణ్‌పై కేసు నమోదు చేశారు. చేబ్రోలు కిరణ్‌ను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా విజయవాడ (Vijayawada) ఇబ్రహీంపట్నం వద్ద అతడిని అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ నేతలే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.













