ఈ నెల 23న టీటీడీ 2018 డైరీలు, క్యాలెండర్లు ఆవిష్కరణ
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి 2018 సంవత్సర డైరీలు, క్యాలెండర్లను ఈ నెల 23న రాత్రి బ్రహ్మూెత్సవాల ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించనున్నారు. ఆ వెంటనే విక్రయాలు ప్రారంభించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. 12 పుటల క్యాలెండర్లు, 20 లక్షలు, డైరీలు 10 లక్షలు, శ్రీవారు, పద్మావతి అమ్మవారి ఫొటోలతో పెద్ద క్యాలెండర్లు వేర్వేరుగా 14 లక్షలు, శ్రీనివాసుడు, అమ్మవారి చిన్న క్యాలెండర్లు, పంచాగం క్యాలెండర్లు సిద్ధం చేశారు. వస్తు సేవల పన్ను ప్రభావంతో డైరీలు, క్యాలెండర్ల ధరలు పెరిగాయని అధికారులు తెలిపారు. 12 పుటల క్యాలెండర్ ధర రూ.75 నుంచి 100, డైరీ ధర రూ.100 నుంచి రూ.120కు పెరిగినట్లు తెలిపారు.













