నంద్యాలలో సీఎం చంద్రబాబుకు గుడి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే తమకు దైవం అంటూ హిజ్రాలు, ఆయనకు గుడి నిర్మించడానికి సిద్ధమయ్యారు. చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకొని కర్నూలు జిల్లా నంద్యాలలో నిర్మించనున్న గుడికి సమతా హిజ్రాల సంఘం ఆధ్వర్యంలో భూమిపూజ నిర్వహించారు. ప్రతి నెలా రూ.1500 పింఛన్ అందించేందుకు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో తమలో మానసిక స్థైర్యం పెరిగిందని హిజ్రాల సంఘం గౌరవాధ్యక్షుడు విజయ్‌కుమార్ తెలిపారు. ఈ గుడిలో చంద్రబాబు వెండి విగ్రహం కోసం రూ.5 లక్షలు ఇస్తున్నట్లు టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు, అభిరుచి మధు ప్రకటించారు. భూమి పూజా కార్యక్రమానికి మంత్రి భూమా అఖిలప్రియ, ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి హాజరయ్యారు.













