విశాఖలో అంతర్జాతీయ సదస్సు
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు విద్యారంగాన్ని సాంకేతిక అంశాలతో సమన్వయం చేసేలా డిసెంబర్ 16-18 తేదీల్లో విశాఖపట్నంలో అంతర్జాతీయ సాంకేతిక సమావేశం (టెక్ కాన్ఫరెన్స్) జరగనుంది. దీనికి సంబంధించి విజయవాడలో మంత్రి గంటా శ్రీనివాసరావు విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వాస్త కళలు, టూరిజం, సాంకేతిక అంశాలకు పెద్ద పీట వేసేలా, పెట్టుబడులను ఆకర్షించేలా ఈ సదస్సు ఉండాలని నిర్ణయించారు. విదేశీ ప్రతినిధులు, విద్యావేత్తలు 1200 మందికి పైగా పాల్గొంటున్న ఈ సదస్సులో విద్యార్థులు పాల్గొనేలా చూడాలని మంత్రి ఆదేశించారు.













