ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ లో శిక్షణ.. అమెరికాలో ఉద్యోగాలు
ఎన్ఆర్ఐ టీడీపీ సెల్లో శిక్షణ పొందిన 10 మందికి అమెరికాకు చెందిన ఓ కంపెనీలో ఉద్యోగాలు లభించాయి. వీరికి మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నియామక పత్రాలు అందించారు. వేమూరి రవి నేతృత్వంలోని ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ నిరుద్యోగ యువతకు శిక్షణ అందిస్తోంది. అమెరికాలోని బోస్టన్ నగరంలో ఉంటున్న ఎన్ఆర్ఐ తేలప్రోలు సూర్య ఇటీవలే తమ సంస్థ బ్రాంచ్‌ను మంగళగిరిలో ప్రారంభించారు. 15 రోజుల క్రితం ఇక్కడ శిక్షణ పొందిన అయిదుగురికి ఆయన ఉద్యోగాలిచ్చారు. తాజాగా మరో 10 మందిని నియమించుకున్నారు అని టీడీపీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.













