తిరుమల శ్రీవారి ఆలయంలో విషాదం.. కరోనాతో
తిరుమల శ్రీవారి ఆలయంలో విషాదం చోటు చేసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కరోనా వైరస్ వెంటాడుతోంది. ఇప్పటికే కరోనా ఎఫెక్ట్ కారణంగా కఠిన ఆంక్షలు మధ్య కొద్ది మందికే దర్శనం అవకాశం కల్పిస్నుత్నారు. తాజాగా తిరుమల శ్రీవారి పైడిపల్లి వంశీయులు అర్చక మిరాశీ కుటుంబానికి చెందిన శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు అర్చకుం శ్రీనివాసనారాయణ దీక్షితులు (75) కరోనా బారిన పడి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడాచారు. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన్ని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఆయన కుమారుడు కృష్ణశేషాచల దీక్షితులు శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు. శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు అర్చకం శ్రీనివాస నారాయణ దీక్షితులు మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు.













