ఆలీ, పోసాని కృష్ణ మురళి కి… కీలక పదవులు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో కొత్త సలహాదారు నియమితులవనున్నారు. ప్రముఖ సినీ నటుడు ఆలీని ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనికి సంబంధించిన త్వరలోనే ఉత్తర్వులు కూడా వెలువడనున్నట్టు ప్రచారం జరుగుతుంది. కొద్ది రోజుల క్రితం ఆలీ సీఎం జగన్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. దీనిపై అప్పట్లో ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తారంటూ ప్రచారం జరింగింది. కానీ అదేమీ జరగలేదు. అయితే ఇప్పుడు మాత్రం ఆలీకి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించేందుకు ఉద్దేశించిన ఫైలు సీఎం జగన్ దగ్గరకు చేరిందని, దీనికి సంబంధించి ఆదేశాలు ఎప్పుడైనా రావొచ్చని వైసీపీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
పోసానీ కృష్ణ మురళి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీఎఫ్డీసీ) చైర్మన్‌గా నియమించనున్నారని అంటున్నారు. ఆలీతో పాటు ఈయన నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు ఒకేసారి వస్తాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఎఫ్‌డీఏ చైర్మన్ గా నియమితులైన విజయ్‌చందర్ ఎలాంటి ప్రభావం చూపించలేకపోయారనే అభిప్రాయం ఆ పార్టీ నేతలో వ్యక్తం అవుతోంది. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో వైసీపీ సోషల్ మీడియా కార్యకలాపాలను కూడా వేగవంతం చేసి జిల్లాల వారీగా నియమకాలు చేపట్టింది. ఇప్పుడు ఆలీ, పోసానీ కృష్ణ మురళిని కూడా ప్రభుత్వంలోకి తీసుకుని వీరి సేవలు పార్టీకి ఉపయోగించుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.













