ఈరోజు మేమంతా సిద్ధం షెడ్యూల్ ఇదే..
2024 ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది వైసీపీ. ఇందులో భాగంగా మేమంతా సిద్ధం సభతో జగన్మోహన్ రెడ్డి తన ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ప్రజల కోసం అవలంబించిన పథకాల గురించి చెప్పడమే కాకుండా గతంలో ప్రభుత్వాలు చేసింది ఏమీ లేదు అంటూ ఎద్దేవా చేస్తూ ముందుకు సాగుతున్నారు జగన్. ఈరోజు మేమంతా సిద్ధం సభలో భాగంగా ఈరోజు జగన్ ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో పర్యటించనున్నారు. నిన్న యాత్ర పూర్తి అయిన తర్వాత కర్నూలు జిల్లా పత్తికొండ కేజీఎన్ ఫంక్షన్ హాల్ నందు జగన్ రాత్రి బస చేశారు. ఈరోజు పత్తికొండ నుంచి ప్రారంభమయ్యే జగన్ యాత్ర గుంతకల్లు నియోజకవర్గం బసినేపల్లి తో అనంతపురం జిల్లాలోకి ఎంటర్ అవుతుంది. ఈరోజు పర్యటనలో భాగంగా గుత్తిలో జగన్ రోడ్ షో ఉంటుంది. అనంతరం రాత్రికి ధర్మవరం నియోజకవర్గం చేరుకొని సంజీవపురంలో జగన్ బస చేస్తారు.













