తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖరారు
వచ్చే ఎన్నికల్లో తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా భూమన అభినయ రెడ్డికి అవకాశం ఇవ్వనున్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి అధికారికంగా ప్రకటించారు. తిరుపతిలో జరిగిన పార్టీ సమీక్ష సమావేశంలో విజయసాయి రెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా భూమన కరుణాకర రెడ్డి పనిచేస్తున్నారు. ఇటీవలే ఆయనకు టీటీడీ చైర్మన్గా సీఎం జగన్ అవకాశం కల్పించారు. కాగా వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా అభినయ రెడ్డిని ఎంపిక చేసినట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఇప్పటికే తిరుపతి అభివృద్ధి పూర్తిగా అభినయ కనుసన్నల్లో జరుగుతోందని, తండ్రికి తగిన తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇందుకు తిరుపతి వైసీపీ నాయకులు ముక్త కంఠంతో తమ సంఫీుభావం తెలిపారు.













