తిరుపతికి మరో అరుదైన గౌరవం
తిరుపతి నగరానికి మరో అరుదైన గౌరవం దక్కింది. దేశంలో భద్రత, రక్షణ ఉన్న నగరాల్లో తిరుపతికి రెండో స్థానం వచ్చింది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అమలు చేస్తున్న విధానాలతో తిరుపతికి రెండో స్థానం చోటు దక్కింది. భద్రత, రక్షణ విషయంలో దేశంలోని 111 నగరాలను కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ పరిశీలించింది. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ తిరుపతికి రెండో స్థానం ప్రకటించింది. ఇప్పటికే తిరుపతికి నివాసయోగ్యమైన నగరాల్లో నాలుగో స్థానం లభించిన విషయం తెలిసిందే. ఫ్రెండ్లీ పోలీసిగ్ నిర్వహణ, హోటళ్లు, రైల్వేస్టేషన్, బస్టాండ్, ఎయిర్పోర్టులో ప్రయాణికులు, భక్తులకు అత్యంత భద్రతను పోలీసులు కల్పిస్తున్నారు. భద్రత, రక్షణలో తిరుపతికి రెండోస్థానంపై డీజీపీ ఆర్పీ ఠాకూర్ హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్లో మరిన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.













