13 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మూెత్సవాలు
తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మూెత్సవాలు వచ్చే నెల 13 నుంచి 21 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ ఏడాది అధికమాసం రావడంతో అక్టోబరు 10 నుంచి 18 వరకు నవరాత్రి ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహించనున్నారు. భక్తుల సౌకర్యార్థం రాత్రి వాహన సేవలు గంట ముందుగానే ప్రారంభమయ్యేలా టీటీడీ స్వల్ప మార్పులు చేసింది. ఈ సేవలు ఉదయం 9-11 గంటల మధ్య యథాతథంగానే జరుగుతాయి. రాత్రివేళ్లల్లో 8-10 గంటల మధ్య జరుపుతారు. అలాగే విశిష్టమైన గరుడ సేవ రాత్రి 7 గంటలకే ప్రారంభిస్తారు.
బ్రహ్మూెత్సవాలను పురస్కరించుకుని వచ్చే నెల 11న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 12న రాత్రి 7-9 గంటల మద్య అంకురార్పణ నిర్వహిస్తారు. 13న సాయంత్రం 4:45 గంటల మధ్య ధ్వజారోహణం అనంతరం రాత్రి 7 గంటలకు శ్రీవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. 21న ఉదయం 7-9 గంటల మధ్య చక్రస్నానం, రాత్రి 7-9 గంటల మధ్య ధ్వజావరోహణం నిర్వహిస్తారు.













