ఆ రెండు రోజులు శ్రీవారి ఆలయం మూసివేత
సూర్య, చంద్ర గ్రహణాల కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. ఈ నెల 25వ తేదీన సూర్యగ్రహణం, నవంబర్ 8న చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. గ్రహణం రోజుల్లో 12 గంటల పాటు స్వామివారి ఆలయం తలుపులు మూసివేయనున్నట్లు టీటీడీ తెలిపింది. సూర్యగ్రహణం రోజు ఉదయం 8:11 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు, చంద్రగ్రహణం రోజు ఉదయం 8:40 నుంచి రాత్రి :720 గంటలకు ఆలయాన్ని మూసివేయనున్నామని పేర్కొంది. గ్రహణాల రోజుల్లో బ్రేక్, ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేశామని, కేవలం సర్వదర్శనం భక్తులకు మాత్రమే స్వామివారి దర్శనం కల్పిస్తామని టీటీడీ వెల్లడిరచింది. గ్రహణాల సమయంలో అన్నప్రసాద పంపిణీ సైతం నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.













