ఆగస్టు 7న శ్రీవారి ఆలయం మూసివేత
చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని ఆగస్టు 7న మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. గ్రహణం 7వ తేదీ రాత్రి 10:52 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 12:48 గంటలకు పూర్తి అవుతుందని వివరించింది. దీని దృష్ట్యా శ్రీవారి మందిరాన్ని 7న సాయంత్రం 4:30 నుంచి మరుసటి రోజు తెల్లవారు జామున 2 గంటల వరకు మూసివేయనున్నట్లు పేర్కొంది. గ్రహణం కంటే 6 గంటలకు ముందే శ్రీవారి ఆలయాన్ని మూసివేయడం ఆనవాయితీగా వస్తున్నట్లు తెలిపింది. 8న వేకువజామున ఆలయ తలుపులు తెరచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహించనున్నట్లు వివరించింది. చంద్రగ్రహణం కారణంగా 7న శ్రీవారికి విశేషపూజ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మూెత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.













