చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేత
చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి శనివారం వేకువ జామున 4:15 గంటల వరకు మూసివేయనున్నట్లు తిరుమల జేఈవో శ్రీనివాసరాజు వెల్లడించారు. ఆ రోజు రాత్రి 11.54 గంటల నుంచి శనివారం తెల్లవారు జామున 3.49 గంటల వరకు చంద్రగ్రహణం గడియలు ఉంటాయని తిరుమలలో వివరించారు. గ్రహణానంతరం మందిరం తలుపులు తెరచి సుప్రభాతం అనంతరం శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తామని చెప్పారు. తోమాల, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు వివరించారు. ఉదయం 7 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుందని తెలిపారు. చంద్రగ్రహణం కారణంగా శుక్రవారం శ్రీవారికి కల్యాణోత్సవం, ఊంజలసేవ, ఆర్జిత బ్రహ్మూెత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేసినట్లు వెల్లడించారు. అన్న ప్రసాదవితరణ నిలిపివేస్తామని, కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండటానికి అనుమతించమని సృష్టం చేశారు.













