జూలై 16న శ్రీవారి ఆలయం మూసివేత
చంద్ర గ్రహణం కారణంగా జూలై 16వ తేదీ రాత్రి 7:00 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 5:00 గంటల వరకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయన తలుపులు మూసివేయనున్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని తిరుమల తిరుపతి దేవస్థానం కోరింది. జూలై 17వ తేదీ బుధవారం ఉదయాత్పూర్వం 1:31 నుంచి 4:29 గంటల వరకు చంద్ర గ్రహణం ఉంటుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందు ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. జూలై 17వ తేదీన ఉదయం 5:00 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవాచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. అయితే ఆ రోజు ఉదయం 11:00 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది.













